Unnikrishnan Nair : రాకెట్ ప్ర‌యోగం స‌మిష్టి విజ‌యం – ఇస్రో

ఉన్ని కృష్ణ‌న్ నాయ‌క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు

Unnikrishnan Nair : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తిరుప‌తి కేంద్రంగా ఉన్న ఇస్రో వేదిక‌గా ప్ర‌యోగించిన రాకెట్ విజ‌య‌వంతంగా నింగిలోకి ఎగిసింది. ఇందులో స్పేస్ వెబ్ కు చెందిన 36 ఉప గ్ర‌హాల‌ను క‌క్ష్య‌లోకి పంపింది. దీనికి సంబంధించి సోమ‌వారం స్పేస్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ ఉన్ని కృష్ణ‌న్ నాయ‌క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

పీఎస్ఎల్ వీ -3 మిష‌న్ వెనుక ప‌ని చేసిన ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ఇస్రో) బృందం తిరువ‌నంత‌పురం చేరుకుంది. విమానాశ్ర‌యానికి చేరుకున్న వారికి అపూర్వ‌మైన రీతిలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా విక్ర‌మ్ సారా భాయ్ రీసెర్చ్ సెంట‌ర్ డైరెక్ట‌ర్ ఉన్ని కృష్ణ‌న్ నాయ‌క‌ర్ మాట్లాడారు.

మార్క్ -3 ప్ర‌యోగం రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుండి కొన‌సాగుతోంద‌న్నారు. మూడేళ్ల విరామం త‌ర్వాత జ‌రిగింద‌ని అంద‌రి కృషి వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఇస్రో చేప‌ట్టిన అత్యంత భారీ రాకెట్ మిష‌న్ లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకోవ‌డం,

విజ‌యంతంగా రాకెట్ ప్ర‌యోగం స‌క్సెస్ కావ‌డంతో భార‌త రాష్ట్ర‌ప‌తి ముర్ము, దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌శంస‌లతో ముంచెత్తారు. భార‌త దేశం ప్ర‌పంచ దేశాల స‌ర‌స‌న నిలిచింద‌ని కొనియాడారు. ఇదిలా ఉండ‌గా ఉన్ని కృష్ణ‌న్ నాయ‌క‌ర్(Unnikrishnan Nair) మాట్లాడుతూ మొత్తం 108 ఉప‌గ్ర‌హాల‌ను పంపాల‌ని ఒప్పందం కుదుర్చుకున్నామ‌ని తెలిపారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 36 ఉప‌గ్ర‌హాల‌ను పంపించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఇందుకు సంబంధించి మిష‌న్ కొన‌సాగుతుంద‌న్నారు. ప్ర‌తి ఏటా త‌మ‌కంటూ ఓ ప్లాన్ ఉంటుంద‌న్నారు. డిమాండ్ కు అనుగుణంగా లాంచ్ చేస్తామ‌ని చెప్పారు.

Also Read : హైద‌రాబాద్ లో వెబ్ 3.0 పై స‌ద‌స్సు

Leave A Reply

Your Email Id will not be published!