Rocket Launcher Attack : ఠాణాపై రాకెట్ లాంచర్ తో దాడి
తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘటన
Rocket Launcher Attack : పంజాబ్ సరిహద్దు జిల్లా లోని పోలీస్ స్టేషన్ పై రాకెల్ లాంచర్ తో దాడి చేశారు. పాకిస్తాన్ లో మరణించినట్లు భావిస్తున్న ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా స్వస్థలం సర్హాలి. అమృత్ సర్ – భటిండా జాతీయ రహదారిపై ఉన్న సర్హాలీ పోలీస్ స్టేషణ్ పై అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ దాడి జరిగింది.
సరిహద్దు జిల్లా తరన్ తరన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయం గురించి పోలీసులు వెల్లడించారు. భవనానికి ఈ ఘటనలో స్వల్ప నష్టం జరిగందని వెల్లడించారు. రాకెట్ లాంచర్(Rocket Launcher Attack) రకం ఆయుధం మొదట స్తంభాన్ని ఢీకొట్టింది. ఆపై పోలీస్ స్టేషన్ భవనాన్ని తాకినట్లు పేర్కొన్నారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్విందర్ సింగ్ రిండా స్వస్థలం సర్హాలి కావడం గమనార్హం. నిషేధిత ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడు. రిండా ఈ ఏడాది మేలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ పై ఆప్పీజీ దాడితో సహా పలు ఉగ్రవాద కేసుల్లో పాల్గొన్నాడు.
ఇదిలా ఉండగా ఈ దాడికి సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని ఉత్తర ప్రదేశ్ లో శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది భారతీయ జనతా పార్టీ. పంజాబ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైందని ఆరోపించారు.
కొలువు తీరిన ఆప్ సెక్యూరిటీని కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. గత ఏడు నెలల కాలంలో ఇది రెండో సారి రాకెట్ లాంచర్ తో దాడి చేయడం.
Also Read : అంగట్లో ఎల్ఐసీ అమ్మకానికి సిద్దం