Rohan Murthy : ఇన్ఫోసిస్ పై రోహ‌న్ మూర్తి ఫోక‌స్

1.45 శాతం వాటా $80 బిలియ‌న్ల విలువ‌

Rohan Murthy : ఎవ‌రీ రోహ‌న్ మూర్తి అనుకుంటున్నారా. ఇన్ఫోసిస్ చైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి, సుధా మూర్తిల త‌న‌యుడు రోహ‌న్ మూర్తి. ఆయ‌న సోద‌రి అక్ష‌తా మూర్తి. ఆమె భ‌ర్త ప్ర‌స్తుత బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి రిషి సున‌క్. బ్రిట‌న్ లో అత్య‌ధిక ఆదాయం క‌లిగిన కుబేరుల జాబితాలో అక్ష‌తా మూర్తి ఒక‌రు.

ఆమె ఫ్యాష‌న్ డిజైన‌ర్ అంతే కాదు మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ బిలియ‌నీర్ కూడా. తాజాగా హాట్ టాపిక్ గా మారారు రోహ‌న్ మూర్తి(Rohan Murthy) . ఆయ‌నకు ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో 1.45 శాతం వాటా ఉంది. ప్ర‌స్తుతం ఇవాల్టితో పోలిస్తే దాని వాల్యూ ఏకంగా $80 బిలియ‌న్ యుఎస్ డాల‌ర్లు అన్న‌మాట‌.

త‌ర‌త‌రాలకు స‌రిప‌డా సంప‌ద అత‌డి చేతిలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు పేరెంట్స్ తో పాటు రోహ‌న్ మూర్తి ఇన్ఫోసిస్ ను ప‌ర్య‌వేక్షిస్తుంటారు. ఇది బెంగ‌ళూరు, అమెరికా వేదిక‌గా ప‌ని చేస్తోంది. టెక్నాల‌జీ ప‌రంగా విస్తృత సేవ‌లు అందిస్తోంది. తండ్రి నారాయ‌ణ మూర్తి స్థాపించిన ఔట్ సోర్సింగ్ దిగ్గ‌జ కంపెనీలో రెండో అతి పెద్ద వాటాదారుగా ఉన్నారు రోహ‌న్ మూర్తి(Rohan Murthy) .

ఆయ‌న‌కు కేవ‌లం 39 ఏళ్లు మాత్ర‌మే. ఉద్యోగుల‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయించే ప‌నిలో ప‌డ్డాడు. డేటాను ఉప‌యోగించడంలో త‌క్కువ క‌ష్ట‌మైన ప‌నిని య‌త్నిస్తున్నాడు. కార్మికులు టీమ్ ల మ‌ధ్య సాఫ్ట్ వేర్ ను ఎలా ఉప‌యోగిస్తున్నార‌నే దాని న‌మూనాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు కంపెనీ డేటాను సేక‌రిస్తుంది.

ఉత్పాద‌క‌త‌ను పెంచేందుకు , ఖ‌ర్చుల‌ను త‌గ్గించేందుకు ప‌రిష్కారాల‌ను సూచిస్తుంది.

Also Read : గూగుల్ క్రోమ్ యూజ‌ర్లు జ‌ర జాగ్ర‌త్త

Leave A Reply

Your Email Id will not be published!