Rohit Vemula Mother : రాహుల్ యాత్రలో రోహిత్ వేముల తల్లి
పాదయాత్రలో గాంధీ ఆలింగనం
Rohit Vemula Mother : కులం జాడ్యానికి, వివక్షకు బలై పోయిన దళిత విద్యార్థి రోహిత్ వేముల. ఆయన తల్లి రాధిక వేముల మరోసారి వార్తల్లో నిలిచారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రోహిత్ వేముల తల్లి రాహుల్ ను కలుసుకున్నారు.
తన కొడుకుకు జరిగిన అన్యాయం గురించి రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నిలదీస్తూ వచ్చారు. అప్పట్లో అది సంచలనంగా మారింది. హర్యానా గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ రాసిన లేఖ కలకలం రేపింది. ఇదే సమయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ దాష్టీకానికి రోహిత్ వేముల బలై పోయినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇది పక్కన పెడితే రోహిత్ తల్లిని(Rohit Vemula Mother) అక్కున చేర్చుకున్నారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భారత్ జోడో యాత్రకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పూర్తయింది పాదయాత్ర. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్రలో బిజీగా ఉన్నారు.
ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తావిస్తూ వస్తున్నారు. యాత్ర సందర్భంగా మంగళవారం రోహిత్ వేముల తల్లి సైతం రాహుల్ గాంధీతో కలిసి కొద్దిసేపు నడిచారు. భారత్ జోడో యాత్రకు సంఘీభావం తెలిపారు. బీజేపీ , ఆర్ఎస్ఎస్ దాడి నుంచి రాజ్యాంగాన్ని కాపాడాలని, రోహిత్ వేములకి న్యాయం చేయాలని కోరారు.
Also Read : రాహుల్ యాత్రకు జనం జేజేలు