Rotomac Fraud Case : పెన్ మేకర్ రొటోమాక్ రూ. 750 కోట్ల స్కాం
అభియోగాలు మోపిన కేంద్ర దర్యాప్తు సంస్థ
Rotomac Fraud Case : చూస్తే పెన్నుల తయారీ సంస్థ. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా భారీ ఎత్తున మోసానికి పాల్పడింది. ఈ దేశంలో ఆర్థిక నేరగాళ్లు, సంస్థలు పెచ్చరిల్లి పోతున్నాయి. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు అందరికీ సుపరిచితమైన పేరు రొటోమాక్.
సదరు సంస్థ రొటోమాక్ గ్లోబల్ పేరుతో పెన్నులు తయారు చేస్తోంది. తాజాగా సీబీఐ రోటోమాక్(Rotomac Fraud Case) గ్లోబల్ రూ. 750 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడిందంటూ అభియోగాలు మోపింది. రైటింగ్ ఇన్ స్ట్రేమెంట్స్ వ్యాపారంలో ఉన్న సదరు కంపెనీ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఏడు బ్యాంకుల కన్సార్టియం పై మొత్తం రూ. 2,919 కోట్లను కలిగి ఉంది.
ఇందులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు 23 శాతం ఎక్స్ పోజర్ ను కలిగి ఉండడం విశేషం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో మోసం చేసినందుకు గాను కాన్పూర్ కు చెందిన రోటోమ్యాక్ గ్లోబల్ , దాని డైరెక్టర్ పై సీబీఐ రూ. 750.54 కోట్ల రూపాయల అభియోగాలు మోపినట్లు వెల్లడించింది సీబీఐ.
అవినీతి నిరోధక చట్టంలోని వివిధ నిబందనలతో పాటు నేర పూరిత కుట్ర (120-బి) , చీటింగ్ (420) కి సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద కంపెనీ, డైరెక్టర్లు సాధనా కొఠారి, రాహుల్ కొఠారిలపై ఏజెన్సీ అభియోగాలు మోపింది. మరో వైపు కన్సార్టియం సభ్యుల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టింది.
ఇదిలా ఉండగా జూన్ 28, 2012న కంపెనీకి రూ. 500 కోట్ల నాన్ ఫండ్ ఆధారిత పరిమితిని మంజూరు చేసినట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆరోపించింది.
Also Read : టెక్నాలజీలో భారతీయులదే హవా