RRR Collections : థియేట‌ర్లు క‌ళ‌క‌ళ బాక్సులు గ‌ల‌గల‌

ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ రూ. 257 కోట్లు

RRR Collections : దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Collections)రికార్డులు తిర‌గ రాస్తోంది. మొద‌టి రోజే రూ. 257 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇండియ‌న్ సినిమా మొద‌టి రోజు ఇంత భారీ స్థాయిలో వ‌సూళ్లు రాబట్ట‌డం ఇదే మొద‌టిసారి.

రామ్ చ‌ర‌ణ్‌, ఆలియా భ‌ట్, జూనియ‌ర్ ఎన్టీఆర్ , అజ‌య్ దేవ‌గ‌న్ క‌లిసి న‌టించిన ఈ చిత్రం వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఏ భార‌తీయ చ‌ల‌న చిత్రం ఇంత భారీ స్థాయిలో కొల్ల‌గొట్టింది లేదు.

ఇక ఇదే ద‌ర్శ‌కుడు తీసిన బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ ఫ‌స్ట్ డే రోజు రూ. 224 కోట్లు సాధించింది. ట్రేడ్ అన‌లిస్ట్ మ‌నోబాల విజ‌య బాల‌న్ శ‌నివారం సినిమా వ‌సూళ్ల గురించి ట్వీట్ చేశారు.

మొద‌టి రోజు వ‌సూళ్ల‌లో ఆంధ్రా, తెలంగాణ నుంచి రూ. 120 కోట్లు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఇక ఓవ‌ర్సీస్ ప‌రంగా చూస్తే రూ. 78 కోట్ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయ‌న్నారు.

ఇక అక్ష‌య్ కుమార్ న‌టించిన బ‌చ్చ‌న్ పాండే మూవీ క‌లెక్ష‌న్లు దాటి ది క‌శ్మీర్ ఫైల్స్ కు రావ‌డం విస్తు పోయేలా చేసింది. ఇప్ప‌టికే ఈ మూవీ రూ. 200 కోట్లు దాటేసింది.

అన్ని చిత్రాల‌ను కాద‌ని ఆర్ఆర్ఆర్ మూవీ టాప్ లో నిలిచింద‌న్నారు మ‌నోబాల‌. రూ. 300 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ తో రూపొందించిన చిత్రం ఇది. ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో విడుద‌లైంది.

1920లో జ‌రిగిన క‌ల్పిత క‌థ , ఇద్ద‌రు నిజ‌మైన హీరోలు, విప్ల‌వ కారులు కొమురం భీమ్ , అల్లూరి సీతారామ‌రాజు జీవితాల ఆధారంగా తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు.

Also Read : స్వ‌ర భాస్క‌ర్ ట్వీట్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!