RRR Movie : మార్చి 25న రానున్న ఆర్ఆర్ఆర్

నాలుగుసార్లు రిలీజ్ చేసిన మేక‌ర్స్

RRR Movie  : బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఆర్ఆర్ఆర్ (రౌద్రం – ర‌ణం – రుధిరం ) మూవీ గురించి మ‌రో అప్ డేట్ వ‌చ్చింది.

క‌రోనా కార‌ణంగా ప‌లుసార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది ఈ చిత్రం. అస‌లు వ‌స్తుందా లేదా అన్న చ‌ర్చ పెద్ద ఎత్తున జ‌ర‌గ‌డంతో మూవీ మేక‌ర్స్ పూర్తి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక సినిమాపై భారీ ఎత్తున అంచ‌నాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్(RRR Movie )లో జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ , అలియా భ‌ట్ ప్ర‌ధాన తార‌ణంగా న‌టించారు. ఈసారి సంక్రాంతి పండ‌గ సంద‌ర్బంగా విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ తో పాటు ఓమిక్రాన్ కేసులు పెర‌గ‌డంతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వాయిదా వేస్తూ వ‌స్తున్నారు ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి. ఇక మార్చి 18 లేదా ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ ఎప్పుడు వ‌స్తుందో అంటూ ట్రోలింగ్ చేయ‌డం మొదలు పెట్టారు ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న‌పై. దీంతో వ‌త్తిడి త‌ట్టుకోలేక మూవీ మేక‌ర్స్ రంగంలోకి దిగారు.

పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ ను ఏప్రిల్ 28వ తేదీని కాకుండా మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక ఈ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండ‌బోదంటూ స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా నాలుగుసార్లు ఈ చిత్రం వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. 2020 జూలై 30న , 2021 జ‌న‌వ‌రి 8న‌, అక్టోబ‌ర్ 13న , 2022 జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ మూవీని విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించి వాయిదా వేస్తూ వ‌చ్చారు.

Also Read : షూటింగ్ ముగిసింది న‌వ్వ‌డ‌మే మిగిలింది

Leave A Reply

Your Email Id will not be published!