RRR Wins Seattle Critics Award : ఆర్ఆర్ఆర్ కు మ‌రో అవార్డు

ఇర‌గ‌దీస్తున్న జ‌క్క‌న్న టీం

RRR Wins Seattle Critics Award : ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం కోట్లాది రూపాయ‌లు కొల్ల‌గొట్టింది. ఇప్ప‌టికే హాలీవుడ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ సైతం ఆర్ఆర్ఆర్ మూవీపై ప్ర‌శంస‌లు కురిపించాడు.

ఆపై తాను రెండుసార్లు ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూశాన‌ని త‌న‌తో స్వ‌యంగా చెప్పారంటూ ట్వీట్ చేశారు ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న‌. సినీ రంగాన్ని విస్తు పోయేలా చేస్తూ బాక్సులు బ‌ద్ద‌లు కొట్టింది. ఈ త‌రుణంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ద‌క్కాయి ర‌ణం. రౌద్రం. రుధిరం (ఆర్ఆర్ఆర్) . బెస్ట్ సాంగ్ గా నాటు నాటు పాట‌కు పుర‌స్కారం ద‌క్కింది.

ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై చిత్రం దుమ్ము రేపుతోంది. సోష‌ల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఆర్ఆర్ఆర్ కు వ‌రుస‌గా అవార్డులు ద‌క్కుతున్నాయి(RRR Wins Seattle Critics Award). ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్స్ , క్రిటిక్ ఛాయిస్ పుర‌స్కారాల‌ను అందుకుంది. ఇదే స‌మ‌యంలో సియాటిల్ క్రిటిక్స్ అవార్డును తాజాగా సొంతం చేసుకుంది.

బెస్ట్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ కేట‌గిరీలో అవార్డు ఆర్ఆర్ఆర్ కి ద‌క్క‌డం విశేషం. ఈ సాంగ్ కు సంబంధించి ప్రేమ్ ర‌క్షిత్ , దినేశ్ క్రిష్ణ‌న‌న్ లు కొరియోగ్ర‌ఫీ చేయ‌గా విక్కీ అరోరా , ఇవాన్ కోస్టాడినోవ్ , నిక్ పావెలో, రాయిచో వాసిలేవ్ లు స్టంట్ కోఆర్డినేట‌ర్లు గా చేశారు. మ‌రో వైపు ఆస్కార్స్ 2023లో మొత్తం ఆర్ఆర్ఆర్ 14 కేటగిరీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంది. జ‌న‌వ‌రి 24న ప్ర‌క‌టించ‌నుంది క‌మిటీ.

Also Read : ఐశ్య‌ర్య రాయ్ కు బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!