CM KCR : దశాబ్ది ఉత్సవాలకు రూ.105 కోట్లు
ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్
CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు జూన్ 2 నుండి 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రూ.105 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అత్యంత ఘనంగా నిర్వహించాలని సూచించారు కేసీఆర్. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
గురువారం సచివాలయంలో జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా నభూతో నభవిష్యత్ అన్న రీతిలో చేపట్టాలని కోరారు. తెలంగాణ ఘన కీర్తిని పాటించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ పై దిశా నిర్దేశం చేశారు సీఎం కేసీఆర్(CM KCR). మంత్రులు, సంబంధిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా కలిసి కట్టుగా దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని స్పష్టం చేశారు.
గ్రామ స్తాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజూ వారీ కార్యక్రమాల గురించి వివరించారు సీఎం. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తెలిపారు కేసీఆర్. దశాబ్ది ఉత్సవాల జయప్రదం కోసం భారీ ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధుల ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్.
Also Read : Praveen Sood