IAS Pooja Singhal : ఐఏఎస్ పూజా సింఘాల్ ఇంట్లో 17 కోట్లు సీజ్
పలు చోట్ల ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు
IAS Pooja Singhal : ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. ప్రజలకు సేవలు చేయాల్సిన ఐఏఎస్ అధికారులు అవినీతిలో అనకొండలుగా మారుతున్నారు.
తాజాగా జార్ఖండ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణిగా ఉన్న పూజా సింఘాల్(IAS Pooja Singhal) సిఏ ఇంట్లో ఈడీ దాడులు జరిపింది. ఈ సోదాల్లో ఏకంగా రూ. 17 కోట్ల నగదు పట్టు బడింది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే కనిపిస్తున్నాయి.
వాటిని లెక్కించేందుకు మిషన్లను తీసుకు వచ్చారు ఈడీ అధికారులు. పూజా సింఘాలకు సీఏ కేటాయించారని, ఆమె ఇంట్లో కూడా సోదాలు జరిపినట్లు సమాచారం. పూజా సింఘాల్(IAS Pooja Singhal) పై ఉదయం నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చర్యలు కొనసాగుతున్నాయి.
ఏకంగా 20 చోట్ల దాడులు చేపట్టారు. తాజా సమాచారం ప్రకారం ఆమె ఇంట్లో రూ. 25 కోట్ల నగదు లభించింది. గర్వాలో అక్రమ మైనింగ్ కేసులో పూజా సింఘాల్ పై ఈడీ చర్య తీసుకుంది.
జార్ఖండ్ కేడర్ సీనియర్ అధికారి పూజా సింఘాల్ ను జార్ఖండ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది రాజీవ్ కుమార్ ఇప్పటికే ఈడీకి సమర్పించారు. పూజా సింఘాల్ మైన్స్ , జియాలజీ కార్యదర్శిగా ఉన్నారు.
జార్ఖండ్ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (జేఎస్ఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా పూజా సింఘాల్ సీఎం హేమంత్ సోరేన్ కు సన్నిహితురాలుగా పేరొందారు.
ఆమె భర్త అభిషేక్ నివాసంలో కూడా ఈడీ దాడులు కొనసాగిస్తోంది. ఆయన ఇంట్లో పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎంఎన్జీఆర్ఏ స్కీం స్కాంలో కీలక నిందితురాలిగా ఉన్నారు.
Also Read : Hizbul Terrorists : ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతం