Margadarshi CID Case : రూ. 242 కోట్ల మార్గదర్శి ఆస్తులు అటాచ్
రామోజీరావుకు కోలుకోలేని బిగ్ షాక్
Margadarshi CID Case : మీడియా బారెన్ గా పేరు పొందిన మార్గదర్శి గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిట్ సంస్థ పలు అక్రమాలకు పాల్పడిందంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగింది ఏపీసీబీసీఐడీ. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా సరే విచారణ జరపాల్సిందేనంటూ ఆదేశించారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan).
ఈ మేరకు ఏపీ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఈ మేరకు సంస్థల అధిపతి రామోజీరావుతో పాటు ఆయన కూతురు, మార్గదర్శి సంస్థల ఎండీ శైలజా కిరణ్ ను కొన్ని గంటల తరబడి సీబీసీఐడీ విచారణ చేపట్టింది. ఆమె సహకరించ లేదని ఆరోపించింది. తమపై ప్రత్యేకించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఏపీ సీబీ సీఐడీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా నిబంధనలకు విరుద్దంగా మార్గదర్శి లోని చందాదారుల నిధులు మళ్లించారని సీబీ సీఐడీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా 45 సంస్థలకు వీటిని ట్రాన్స్ ఫర్ చేసినట్లు తమ విచారణలో తేలిందని వెల్లడించింది దర్యాప్తు సంస్థ. అక్రమాలు చోటు చేసుకున్నది నిజమని తేలడంతో రూ. 242 కోట్ల మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసినట్లు ప్రకటించింది. ఒక రకంగా నిన్నటి దాకా మీడియాను అడ్డం పెట్టుకుని ఆధిపత్యం చెలాయించిన రామోజీ రావుకు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పక తప్పదు.
Also Read : Tirumala : తిరుమల గిరులు పోటెత్తిన భక్తులు