Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు
పెరిగిన భక్తులు భారీగా కానుకలు
Tirumala Hundi : తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. గత కొన్ని రోజులుగా ఎడ తెరిపి లేకుండా దర్శించు కునేందుకు తరలి వస్తున్నారు భక్త జన బాంధవులు. జూన్ 28న బుధవారం శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మను 71 వేల 615 మంది దర్శించుకున్నారు. స్వామి వారికి 30 వేల 219 మంది తలనీలాలు సమర్పించారు. ఇక భక్తులు ఎప్పటి లాగే స్వామి వారి కోసం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు వచ్చింది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వెల్లడించింది.
సుదూర ప్రాంతాల నుంచి దర్శనం కోసం వచ్చిన భక్తులు 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారని పేర్కొంది. ఇక టోకెన్లు లేకుండా ఉన్న భక్తులకు కనీసం 15 గంటలకు పైగా దర్శన భాగ్యం కలగనుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా వెసవి సెలవులు పూర్తి అయినప్పటికీ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు తిరుమలకు. ఇదే సమయంలో విదేశాల నుంచి కూడా భక్తులు శ్రీవారి బాట పట్టారు.
కాగా అష్టకష్టాలు పడి స్వామి కృపకు పాత్రులు కావాలని పరితపించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు గాను భారీ ఎత్తున ఏర్పాట్లను చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మేరకు చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Also Read : Chaturveda Havanam : ఘనంగా శ్రీనివాస చతుర్వేద హవనం