RS Praveen Kumar : వాడుకుని వదిలేసే పార్టీలవి
బెల్లయ్యకు షాక్ తప్పదు - ఆర్ఎస్పీ
RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బెల్లయ్య నాయక్ తన గురించి చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
RS Praveen Kumar Key Comments
ఒక రకంగా సెటైర్ వేశారు ఆర్ఎస్పీ(RS Praveen Kumar). బీఎస్పీ ఎవరికి తల వంచదని, దోపిడీ వర్గాల నుంచి బహుజనులను కాపాడు కోవాలనే తాము పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు ఆర్ఎస్పీ. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పేద వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చేస్తాయని ఆరోపించారు.
ఇప్పటి దాకా అన్ని పార్టీల చరిత్ర అంతా ఒక్కటేనని పేర్కొన్నారు. ముందు నుంచి ఉద్యమాలతో పరిచయం కలిగిన మీలాంటి వారికి అన్యాయం జరుగుతోందనే తాము బలంగా వినిపిస్తున్నామని తెలిపారు ఆర్ఎస్పీ.
మీరు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీపై తనకు ఎలాంటి భ్రమలు లేవన్నారు. అలా ఉంటే తన పదవికి రాజీనామా చేసిన వెంటనే చేరేటోడినని తెలిపారు. బూర్జూవా పార్టీలకు చుక్కలు చూపించిన ఘనుడు కాన్షీరామ్ అన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
ఈ పార్టీలన్నీ ఉన్నత వర్గాలకు ఊడిగం చేస్తాయని, మనలాంటి వాళ్లకు సీఎంలు అయ్యే ఛాన్స్ ఇవ్వవని తెలిపారు. బీఎస్పీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు.
Also Read : CM Siddarmaiah : డీజీపీల పాత్ర కీలకం – సీఎం