RS Praveen Kumar : జ‌నం మ‌ధ్య‌నే ఉంటా వాళ్ల కోసం జీవిస్తా

బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్

RS Praveen Kumar : హైద‌రాబాద్ – బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. త‌న‌పై అన్ని వైపుల నుంచి అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. కానీ తాను కింది స్థాయి కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు నీతి నిజాయితీతో, ధ‌ర్మానికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

RS Praveen Kumar Shocking Comments

పైకి మాత్రం భ‌జ‌న చేస్తున్నార‌ని, లోన న‌ర‌న‌రాన వివ‌క్ష చూపిస్తున్నారంటూ ఆరోపించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). ప్ర‌త్యేకించి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంద‌రు త‌న‌పై విష ప్ర‌చారం చేస్తున్నార‌ని తాను బాధ ప‌డ‌టం లేద‌న్నారు. తాను జ‌నం కోసం గౌర‌వ ప్ర‌ద‌మైన , భ‌ద్ర‌మైన ఉద్యోగాన్ని వ‌దిలి వేసి వ‌చ్చాన‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న‌పై స్పష్ట‌మైన ఆధారాలు ఉంటే ద‌య‌చేసి స్థానిక పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయాల‌ని స‌వాల్ చేశారు ఆర్ఎస్పీ. తాను జైలుకు వెళ్ల‌డానికైనా ఉరి కంభం ఎక్కేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు బీఎస్పీ చీఫ్.

ద‌మ్ముంటే ట్యాంక్ బండ్ అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు. తెలంగాణ‌లో రోజు రోజుకు బీఎస్పీ పుంజుకుంటోంద‌న్నారు. దీనిని జీర్ణించు కోలేని రాజ్ బోడా లాంటి మూర్ఖుల‌తో త‌న‌పై, మంద‌కృష్ణ మాదిగ‌పై జుగుస్సాక‌ర‌మైన మాట‌ల‌తో దాడి చేయిస్తున్నార‌ని ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

Also Read : Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 2.58 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!