RS Praveen Kumar : ఒకే రోజు మూడు పరీక్షలు ఒప్పుకోం
అడ్డుకుంటామని బీఎస్పీ చీఫ్ వార్నింగ్
RS Praveen Kumar : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) నిప్పులు చెరిగారు. మరోసారి ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకే అభ్యర్థి ఒకే రోజు మూడు పరీక్షలు ఎలా రాస్తాడని ప్రశ్నించారు. ఏప్రిల్ 30న ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులు పలు జాబ్స్ కు అప్లై చేసుకున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఏప్రిల్ 30న తెలంగాణ విద్యుత్ సంస్థ లైన్ మెన్ పరీక్ష చేపట్టనుంది. ఇప్పటికే ప్రకటించింది కూడా. అభ్యర్థులు కూడా సిద్దమయ్యారు. ఇదే రోజు విద్యుత్ సంస్థ పరీక్షతో పాటు మరో రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు.
దీనిని తీవ్రంగా తప్పు పట్టారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) . ఒకే అభ్యర్థి మూడు పరీక్షలు ఒకే రోజు ఎలా రాయగలుగుతాడని ప్రశ్నించారు. వెంటనే మూడు పరీక్షలు నిర్వహించడాన్ని నిలిపి వేయాలని ఒకే రోజు ఒకే పరీక్ష చేపట్టాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
లేకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు బీఎస్పీ చీఫ్ బీఆర్ఎస్ సర్కార్ మరోసారి పునరాలోచించాలని కోరారు. ఒకే రోజు పలు పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు ఒకే దానిని రాస్తారని మిగతా వాటిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని ఒకే పరీక్ష చేపట్టాలని మిగతా పరీక్షలను ఇతర రోజుల్లో చేపట్టాలని కోరారు.
Also Read : తలైవాకు బాలయ్య గ్రాండ్ వెల్ కమ్