RS Praveen Kumar : అంబేద్కర్ పేరుతో పాలకుల మోసం
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ ఓట్ల రాజకీయం మొదలైంది. ఇప్పటి దాకా అంబేద్కర్ గురించి మాట్లాడని వాళ్లు ఇప్పుడు ఆయన జపం చేస్తున్నారు. ఇదంతా ప్రజలను మోసం చేసే ప్రయత్నం అన్నారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం ఇటిక్యాల మండలం ఉదండాపూర్ లో ఆయన ప్రసంగించారు. ప్రతి ఒక్కరికీ చదువు అందాలని, విద్య వల్లనే జీవితంలో, సమాజంలో మార్పు వస్తుందని అంబేద్కర్ చెప్పారు.
ఈ దేశానికి భారత రాజ్యాంగం అనే ఆయుధాన్ని ఇచ్చిన మహనీయుడు అంబేద్కర్ విగ్రహారాధన తప్పన్నాడు. ఈ నేలపై పుట్టిన ప్రతి ఒక్కరికీ బతికే హక్కు ఉంటుందని చెప్పారని, కులం పేరుతో, మతం పేరుతో ప్రజల్ని విడదీయమని ఏనాడూ చెప్పలేదన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్నారు, మూడు ఎకరాల భూమి ఇస్తానని చెప్పారు. కానీ ఆచరణకు ఏమైనా నోచుకున్నదా అని నిలదీశారు. ఈ రాష్ట్రంలో పేదలు ఇంకా పేదలుగానే ఉండి పోతున్నారో ఆలోచించు కోవాలన్నారు.
ఓటు అనేది ఆయుధమని దానిని సరైన వ్యక్తులకు వేస్తేనే మనం ప్రశ్నించ గలమన్నారు. లేక పోతే ఇలా ప్రభుత్వం ఇచ్చే తాయిలాల కోసం వేచి చూడాల్సిన దుస్థితి వస్తుందన్నారు. పాలకులు పేదల చదువు కోసం కృషి చేయాలని, సంపద అంతా ఒక్కరి దగ్గర ఉండ కూడదని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి. కేవలం విగ్రహాలు పెట్టినంత మాత్రాన ఆశయాలు నెరవేరవన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Also Read : ఓట్ల కోసం అంబేద్కర్ జపం – బండి