RS Praveen Kumar : ‘రాణి’ని కాకుండా ‘శాంతి’కి అంద‌లం

సీఎం కేసీఆర్ పై ఆర్సీపీ ఫైర్

RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సీనియార్టీని ప‌క్క‌న పెట్టి శాంతి కుమారికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని ఎలా నియ‌మిస్తారంటూ ప్ర‌శ్నించారు. ఆమె కంటే సీనియార్టీలో రాణి కుముదిని ముందంజ‌లో ఉంద‌ని ఆమెకు రావాల్సిన పోస్ట్ ను రూల్స్ కు విరుద్దంగా సీఎం కేసీఆర్ శాంతి కుమారికి అవ‌కాశం ఇచ్చార‌ని ఆరోపించారు.

ప్ర‌స్తుతం ఆర్ఎస్పీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. రూల్స్ ను ప‌క్క‌న పెట్టి సీఎస్ గా సోమేశ్ కుమార్ ను నియ‌మించార‌ని ఇప్పుడు కేవ‌లం రాజ‌కీయాల కోసం శాంతి కుమారిని తీసుకు వ‌చ్చి సీఎస్ గా అందలం ఎక్కించారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో సిర్పూర్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప క‌బ్జాకు గురి చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

ఈ క‌బ్జాల వెనుక మంత్రి కేటీఆర్ హ‌స్తం ఉంద‌ని అన్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. ఈ మొత్తం ప్రాంతం ఆంధ్రా వ‌ల‌స భూస్వామ్య పాల‌కుల చేతుల్లోకి వెళుతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రాణ‌హిత‌, చేవెళ్ల ప్రాజెక్టును గంగ‌లో క‌లిపేశారని మేడిగ‌డ్డ‌కు త‌ర‌లించారంటూ ఫైర్ అయ్యారు.

ఇప్ప‌టికే విలువైన భూముల‌ను అప్ప‌నంగా అమ్మ‌కానికి పెట్టేశారంటూ ఫైర్ అయ్యారు బీఎస్పీ చీఫ్‌. కొమురం భీం జిల్లా కాగ‌జ్ న‌గ‌ర్ అంబేద్క‌ర్ చౌర‌స్తాలో బీఎస్పీ ఆధ్వ‌ర్యంలో బ‌హుజ‌న రాజ్యాధికార మ‌హాస‌భ నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అత‌థిగా హాజ‌రై ప్ర‌సంగించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar) . సిర్పూర్ పేప‌ర్ మిల్లులో స్థానికేత‌రుల‌కు జాబ్స్ ఇచ్చారంటూ ఆరోపించారు.

Also Read : నేనూ ఒక‌ప్పుడు ఎన్నారైనే – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!