RS Praveen Kumar : హోం గార్డులపై కేసీఆర్ వివక్ష
నిప్పులు చెరిగిన బీఎస్పీ చీఫ్
RS Praveen Kumar : బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ మాయ మాటలు చెప్పడంలో, మోసం చేయడంలో ఆరి తేరారంటూ ఆరోపించారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో హోం గార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారని కానీ ఇప్పటి వరకు వారి పట్ల కేసీఆర్ దయ చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
RS Praveen Kumar Says
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. తెలంగాణలో కొన్ని సంవత్సరాలుగా శ్రమ దోపిడీకి గురవుతున్నారని వాపోయారు. పోలీసులు, ఆర్మీ జవాన్లతో పాటు హోం గార్డులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయారని కానీ వారికి ఇప్పటి వరకు సహాయం చేయలేదని వాపోయారు.
గత కొన్నేళ్లుగా తమ జాబ్స్ ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ పలుమార్లు ఆందోళనలు కూడా చేపట్టారని కానీ స్పందించిన దాఖలాలు లేవన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). ఇదిలా ఉండగా ఆందోళన బాట పట్టిన హోం గార్డులను విక్షచణా రహితంగా దాడులకు దిగడం, అరెస్ట్ లు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
శాసనసభ సాక్షిగా హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తానన్న సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
Also Read : AIMIM Support : అవిశ్వాస తీర్మానానికి ఎంఐఎం మద్ధతు