RS Praveen Kumar : ఇంకెంత కాలం భూముల పందేరం
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : ఇంకెంత కాలం ఈ భూముల పందేరం కొనసాగిస్తూ వస్తారంటూ నిప్పులు చెరిగారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). ఆయన సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న కోకా పేటను ఖతం చేశారని, రేపు బుద్వేల్ మీద పడతారని, ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ చుట్టూ అమ్మకానికి పెడతారంటూ ఎద్దేవా చేశారు బీఎస్పీ చీఫ్.
RS Praveen Kumar Comments
ఇక చివరకు మిగిలింది పేదల భూములేనని , వాటిని కూడా అమ్మినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదంటూ హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దొర పాలనలో పేదలకు చివరకు కట్టుకునేందుకు దుస్తులు కూడా లేకుండా చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
బుద్వేల్ లో 255 ఎకరాల అసైన్ భూములను ప్రభుత్వం కుట్ర పూరితంగా , చట్ట విరుద్దంగా హైదరాబాద్ నగర పాలక సంస్థ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, టూరిజం శాఖ ప్రైవేట్ వ్యక్తులతో కలిసి పేదల నుండి బలవంతంగా గుంజుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆర్ఎస్పీ.
ఈ అక్రమాలకు సంబంధించి గత జూలై31న ఆధారాలతో సహా బయట పెట్టానని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా అసైన్డ్ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాల్సిన సర్కార్ అప్పనంగా అమ్మకానికి పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Also Read : RTC Chalo Raj Bhavan : ఆర్టీసీ ఉద్యోగుల ఛలో రాజ్ భవన్