RS Praveen Kumar : కేసీఆర్ పాలనలో సర్పంచ్ లు ఆగమాగం
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ చీఫ్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు భారత రాష్ట్ర సమితి కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ . మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. నిధులు మంజూరు చేయకుండా సర్పంచులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తండాలు, గూడేలాను కొత్త గ్రామ పంచాతీలను ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు 5,145 గ్రామాలకు భవనాలు లేవని పేర్కొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, కార్యదర్శులు ఎక్కడ కూర్చొని పాలన చేయాలని ప్రశ్నించారు బీఎస్పీ కన్వీనర్. మీకంటే ఫామ్ హౌస్ లు ఉన్నాయని కానీ వాళ్లకు పని చేసేందుకు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
మిషన్లు, ప్రాజెక్టులు, కమీషన్లు సీఎం కుటుంబానివని, అప్పులు , ఆత్మహత్యలు మాత్రం సర్పంచులకా అని నిలదీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). మిషన్ భగీరథతో పాటు ఇతర ప్రాజెక్టులన్నీ ఆంధ్రాకు చెందిన కాంట్రాక్టర్లకు గంప గుత్తగా అప్పగించారంటూ ఆరోపించారు. చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించకుండా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు బీఎస్పీ చీఫ్.
30 శాతం కమీషన్లు ఇచ్చే మెగా కంపెనీలకు మాత్రం వేల కోట్ల బిల్లులు అడ్వాన్స్ గా ఎలా , ఎందుకు చెల్లించారంటూ నిలదీశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు బీఎస్పీ చీఫ్. ఊర్లల్లో పేర్లకు మాత్రమే సర్పంచ్ లు. కానీ వాళ్లకు పవర్స్ లేవన్నారు.
Also Read : Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్
