RS Praveen Kumar : బంగారు తెలంగాణలో జీతాలు రాలే
సీఎం కేసీఆర్ ను నిలదీసిన ఆర్ఎస్పీ
RS Praveen Kumar : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు రాష్ట్ర సర్కార్ పై. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడం వల్ల పాలన గాడి తప్పిందని ఆరోపించారు. బంగారు తెలంగాణలో నేటి వరకు నిత్యం నిద్రహారాలు మాని విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, ఇతర ఉద్యోగులకు జీతాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కాంలు, కమీషన్ల మీద ఉన్నంత ఆసక్తి రాష్ట్ర అభివృద్దిలో, ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమని పేర్కొన్నారు. జీతాల సంగతి ఇలా ఉంటే ఇక పీఆర్సీ ఏరియర్స్ కూడా కేవలం రెండే ఇచ్చరాంటూ వాపోయారు. మూడు సరెండర్ లీవులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).
వేతనాలు సకాలంలో అందుతాయని ఆయా బ్యాంకులలో పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నారని, ఈఎంఐలు కట్టక పోవడంతో ఫైన్లు వేస్తున్నారంటూ తెలిపారు. దీని వల్ల సిబిల్ స్కోర్ రేటింగ్ తగ్గుతోందన్నారు. స్కూల్ ఫీజులు కట్టక పోవడంతో యజమానులు పిల్లలను ఇంటికి పంపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్ కు భద్రత కల్పిస్తున్న వారి పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు ఆర్ఎస్పీ.
Also Read : MS Dhoni : ఎంఎస్ ధోనీకి గ్రాండ్ వెల్ కమ్