RS Praveen Kumar : బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి కేరాఫ్
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar). ఉద్యమం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఓ వైపు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే మరో వైపు మంత్రులు, ఎమ్మెల్యేలు దర్జాగా కబ్జాలకు పాల్పడుతుండడం దారుణమన్నారు. ఇందుకోసమేనా బలిదానాలు చేసుకున్నది రాష్ట్రం కోసం అని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
RS Praveen Kumar Words
ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నారని, సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ధరణి పేరుతో దారుణాలు ఎన్నో జరిగాయని, విలువైన భూములను అప్పనంగా అయిన వారికి కట్టబెట్టారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినంత మేర దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని, ఇకనైనా మారాలని లేకపోతే ఏదో ఒక రోజు ప్రజల సమక్షంలో శిక్ష ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు కబ్జాకోరులుగా మారి పోతే ఎలా అని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Also Read : Congress Slams Modi : డబుల్ ఇంజన్ సర్కార్ పజిల్