RS Praveen Kumar :కేసీఆర్ డీజేపీ ఏం త్యాగం చేశారు
బహుజనుల గురించి ప్రస్తావించరా
RS Praveen Kumar : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) నిప్పులు చెరిగారు. ఆయన ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను , డీజేపీని ఏకి పారేశారు. వారిపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సందర్భంగా ప్రభుత్వం ఆర్భాటంగా ఉత్సవాలు నిర్వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోరుకున్న తెలంగాణ రాలేదని వాపోయారు. కేవలం దొరల తెలంగాణ మాత్రమే సిద్దించిందని ఆరోపించారు ఆర్ఎస్పీ.
ఇక తెలంగాణ సంబురాలలో భాగంగా ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ – డీజీపీ ఫ్లెక్సీలే దర్శనం ఇస్తున్నాయని ఇదెక్కడి చోద్యమని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ , పదవీ త్యాగం చేసిన డీఎస్పీ నళిని, ఆంధ్ర పాలకులను ఎదిరించిన ఏఆర్పీసీ శ్రీనివాస్ గౌడ్ ల ఫోటోలు, ఫ్లెక్సీలు ఉండాలని కానీ వారి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎందుకని, వీళ్లు బహుజనుల బిడ్డలనేనా మీ చిన్న చూపు అంటూ సీఎం కేసీఆర్ ను నిలదీశారు.
హోంగార్డులకు భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చారు సీఎం. వారి వేతనాలను పెంచుతామన్నారు. ఆపై రెగ్యులరైజేషన్ చేస్తామని ఆశలు కల్పించారు. కానీ వారితో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పోలీసులకు సరెండర్ లీవులు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు బీఎస్పీ చీఫ్.
Also Read : Navjyot Singh Sidhu : పంజాబ్ సీఎం మాన్ కాదు కేజ్రీవాల్
