RS Praveen Kumar : దేశాన్ని మణిపూర్ మోడల్ చేస్తారా
బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : మణిపూర్ లో చోటు చేసుకున్న మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. సభ్య సమాజం తలొంచుకునేలా ఈ దారుణం చోటు చేసుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. దోషులను పట్టుకోవడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విఫలమైందని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).
RS Praveen Kumar Said
ఇక్కడ పాలన ఆఫ్గనిస్తాన్ కంటే ఘోరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ లో హింసా కాండ చెలరేగుతున్నా గత కొంత కాలం పాటు మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ గత్యంతరం లేక స్పందించారని, ఇది దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు బీఎస్పీ చీఫ్. గుజరాత్ మోడల్ అంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ చివరకు దేశాన్ని మణిపూర్ మోడల్ చేస్తారా అంటూ ప్రశ్నించారు . మణిపూర్ లో ఓ వర్గం ఆదివాసీ మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం , హత్యలు చేయడం దారుణమని , అమానవీయమని ఆవేదన చెందారు.
ఇటువంటి సంఘటనలు సభ్య సమాజాన్ని మరింత ప్రభావం చేస్తాయని పేర్కొన్నారు. ఇక దళితుడిపై మూత్రం పోసిన ఘటనకు పాల్పడిన వ్యక్తి కోసం చందాలు వసూలు చేయడం బీజేపీకే చెల్లిందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
Also Read : Manipur Woman Parade : మణిపూర్ దారుణం సర్వత్రా ఆగ్రహం