RS Praveen Kumar : తెలంగాణ గాంధీ జ‌య‌శంక‌ర్ కు నివాళి

పిలుపునిచ్చిన బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ

RS Praveen Kumar : తెలంగాణ సిద్దాంత‌క‌ర్త‌, మ‌హోన్న‌త మాన‌వుడు, తెలంగాణ గాంధీ ప్రొఫెస‌ర్ కొత్త‌ప‌ల్లి జ‌య‌శంక‌ర్ కు ఘ‌న‌మైన నివాళి అర్పించారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. జూన్ 21న తెలంగాణ గాంధీగా పేరు పొందిన జ‌య‌శంక‌ర్ సారు వ‌ర్దంతి. ఆయ‌న ఇదే రోజున 2011లో ప‌ర‌మ ప‌దించారు. త‌న జీవిత కాల‌మంతా తెలంగాణ కోసం విరామం ఎరుగ‌కుండా కృషి చేసిన గొప్ప వ్య‌క్తి అని కొనియాడారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

ప్ర‌త్యేక రాష్ట్రం కావాల‌ని, ఏపీ ఉమ్మ‌డి రాష్ట్రంలో త‌న గొంతుక‌ను వినిపించిన యోధుడ‌ని ప్ర‌శంసించారు. ఆయ‌న చూపిన బాట గొప్ప‌ద‌న్నారు. ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సారు ప్ర‌తిపాదించిన తెలంగాణ సిద్దాంతం యావ‌త్ ప్ర‌పంచాన్ని క‌దిలించింద‌న్నారు. ఆచార్యుడిగా, మేధావిగా, ర‌చ‌యిత‌గా, వ‌క్త‌గా, సిద్దాంత‌క‌ర్త‌గా జ‌య‌శంక‌ర్ సారు నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంద‌న్నారు.

తుది శ్వాస వ‌ర‌కు ఆయ‌న తెలంగాణ కోసం క‌ల‌వ‌రించాడ‌ని గుర్తు చేసుకున్నారు. ఆయ‌న క‌న్న క‌ల తెలంగాణ రాష్ట్రాన్ని చూడ‌కుండానే ఈ లోకాన్ని వీడారని ఆవేద‌న చెందారు బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar). నీళ్లు, నిధులు, నియామకాలు కోసం ఎలా పోరాడాలో నేర్పిన ధీశాలి ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ సారు అని స్ప‌ష్టం చేశారు. నాటి ఉమ్మ‌డి పాల‌న‌పై ఉక్కు స్వ‌ర‌మై నిన‌దించిన ఆచార్యుడికి తెలంగాణ ప్ర‌జ‌లంద‌రి త‌ర‌పున క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నామ‌ని తెలిపారు .

Also Read : Media Waiting : మీడియా అత్యుత్సాంపై సెటైర్లు

Leave A Reply

Your Email Id will not be published!