RS Praveen Kumar : సీఎం విధులు..బాధ్య‌త‌ల‌పై ఫిర్యాదు

ఆర్టీఐ కింద సీఎస్ కు ద‌ర‌ఖాస్తు

RS Praveen Kumar : బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు సంబంధించి జ‌వాబుదారీగా ఉండాల్సిన కేసీఆర్ ప్ర‌భుత్వ ఖజానాను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న రాష్ట్ర స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ముఖ్య‌మంత్రి విధులు, బాధ్య‌త‌లు ఏమిటో, ఆయ‌న సీఎంగా కొలువు తీరిన త‌ర్వాత ఏమేం చేశాడో పూర్తి వివ‌రాలు ఇవ్వాల‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఆర్టీఐ కింద రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కి ద‌ర‌ఖాస్తు చేశారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంత జీతం తీసుకుంటున్నారు. ఆయ‌న ఏ నెల నుంచి జీతం తీసుకుంటున్నారో చెప్పాల‌ని కోరారు. ద‌య‌చేసి సీఎం జీతం స్లిప్ కాపీని షేర్ చేయాల‌ని సూచించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌తి నెలా ఎంత డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తున్నారో చెప్పాల‌ని కోరారు ఆర్ఎస్పీ. సీఎం భ‌ద్ర‌త‌కు, ఎర్ర‌వ‌ల్లిలో ఉన్న ఆయ‌న ఫామ్ హౌస్ కి వెళ్లేందుకు ఎంత డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నారు.

కేసీఆర్ ప్ర‌తి రోజూ ఎన్ని స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తారో తెలియ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు . చీఫ్ సెక్ర‌ట‌రీ కార్యాల‌యం సీఎం ఆఫీసుకు ఎన్ని ఫైళ్ల‌ను పంపింది. జూలై 2014 నుండి మార్చి 2023 వ‌ర‌కు ఏయే అంశాల‌పై పంపించారో వివ‌రాలు ఇవ్వాల‌ని కోరారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్(RS Praveen Kumar).

ఇప్ప‌టి దాకా ఎన్ని శాఖ‌ల‌ను సీఎం స‌మీక్షించారు. విధాన నిర్ణ‌యాలు ఏమిటో చెప్ప‌గ‌ల‌రా అని ప్ర‌శ్నించారు. గ‌త 9 సంవ‌త్స‌రాలలో విద్య‌, ఆరోగ్యం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ‌ల‌పై సీఎం ఎన్నిసార్లు స‌మీక్ష చేప‌ట్టారు. ఆ తేదీలు, తీసుకున్న నిర్ణ‌యాల‌ను తెలియ చేయాల‌ని కోరారు. సీఎం పాత్ర‌, విధులు, బాధ్య‌త‌లు ఏమిటో కూడా తెలియ ప‌ర్చాల‌ని సూచించారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్.

Also Read : Soumyanatha Swamy : సౌమ్య‌నాథ‌ స్వామి ఉత్స‌వాలు షురూ

Leave A Reply

Your Email Id will not be published!