Mohan Bhagwat : ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతా కేంద్రానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat )హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
ఆయనకు సాదర స్వాగతం పలుకుతారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి. రూ. 1000 కోట్లతో ఏర్పాటు చేసిన సమతా కేంద్రం ఇప్పుడు దేశం తన వైపు చూసేలా చేసింది.
జై శ్రీమన్నారాయణ అన్న నినాదం మారుమోగుతోంది. చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో మహా క్రతువు కొనసాగుతోంది. 5 వేల మందికి పైగా రుత్వికులు యాగశాలలో పాల్గొంటున్నారు.
వేద మంత్రోశ్చారణల మధ్య శ్రీ భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది మహోత్సవాలు కొనసాగుతున్నాయి. 114 యాగశాలల్లో 1035 హోమ గుండాలు ఏర్పాటు చేశారు.
ఈనెల 2న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 14 వరకు కొనసాగుతున్నాయి. రాజకీయ, సినీ, వివిధ రంగాలకు చెందిన వారు ఇక్కడికి విచ్చేశారు.
3.30 గంటలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat )హాజరవుతారు. యాగశాలలో పాల్గొని పూజలు చేస్తారు. అనంతరం సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుంటారు.
రాత్రి 8 గంటల దాకా ఇక్కడే ఉంటారు. వివిధ పూజా కార్యక్రమాలలో పాల్గొని ప్రవచన మండపంలో జరిగే ధర్మాచార్య సభలో ప్రసంగిస్తారు.
ఇవాళ శ్రీరామనగరంలో ఐశ్వర్య ప్రాప్తి కోసం శ్రీలక్ష్మి నారాయణ ఇష్టి, సంతాన ప్రాప్తి కోసం వైనతేయ ఇష్టి , చిన్నారుల విద్యాభివృద్ధి కోసం , పెద్దల మానసిక సాంత్వన కోసం హయగ్రీవ పూజ చేస్తారు.
ధర్మాచార్య సదస్సులో ఇవాళ 200 మంది సాధు, సంతులు, పీఠాధిపతులు పాల్గొంటారు. ప్రవచన మండపంలో ప్రముఖులతో ప్రవచనాలు, కళాకరులతో సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగుతాయి. సాయంత్రం శ్రీలక్ష్మీ నారాయణ మహా యజ్ఞం చేపడతారు.
Also Read : జగన్ అద్బుతమైన పాలకుడు