Prashant Kishor : బీజేపీ కంటే ఆర్ఎస్ఎస్ బలమైనది
ప్రశాంత్ కిషోర్ కీలక కామెంట్స్
Prashant Kishor : భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన బీహార్ లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఈ రెండింటిని రుచికరమైన కాఫీతో పోల్చారు.
3,500 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ప్రశాంత్ కిషోర్ ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు. ఆదివారం చంపారన్ జిల్లాలోని లారియాకు చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ నిజమైన కాఫీ అని బీజేపీ జస్ట్ ది ప్రూత్ అని పేర్కొన్నారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను ఆయన మరోసారి ఎత్తి పొడిచారు. తరుచూ ఈ మధ్య కాలంలో సీఎంను టార్గెట్ చేశారు పీకే. అంతే కాదు ఆయనకు మెదడు పని చేయడం లేదన్నారు. అంతే కాదు ఏదో ఒకరోజు మళ్లీ కేంద్రంలోని బీజేపీ తో జత కట్టబోయేది ఖాయమని సంచలన ఆరోపణలు చేశారు.
దీనిపై ఇప్పటికే జేడీయూ చీఫ్ లాలన్ సింగ్ నిప్పులు చెరిగారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor). గాంధీ కాంగ్రెస్ ను పునరుద్దరించడం ద్వారానే గాడ్సే సిద్దాంతాన్ని ఓడించగలం అని గ్రహంచేందుకు తనకు చాలా సమయం పట్టిందన్నారు. ప్రజలను తాను చెప్పాలని అనుకున్న దానిని వారి మూలాల్లోకి తీసుకు వెళ్లగలిగే సత్తా మోదీకి ఉందన్నారు.
దీని కారణంగా ఏర్పడిన గ్యాప్ ను పునరుద్దరించ గలమన్నారు ప్రశాంత్ కిషోర్. బీజేపీ కంటే ఆర్ఎస్ఎస్ అత్యంత బలమైనదని అన్నారు.
Also Read : ప్రజలనే కాదు ఎమ్మెల్యేలను కొంటే ఎలా