RTC Bill Approved : ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు ఆమోదం
ఉన్నతాధికారులతో గవర్నర్ చర్చ
RTC Bill Approved : హమ్మయ్య గండం గడిచింది. ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు ఆమోదం లభించింది. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఓకే చెప్పారు. తాజాగా ఆర్టీసీ సంస్థను, ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆర్టీసీ బిల్లును రూపొందించింది.
RTC Bill Approved Governer
అసెంబ్లీ సమావేశాలలో బిల్లును ప్రవేశ పెడతామని ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్టీసీ బిల్లును ప్రవేశ పెట్టడం, దానిని పర్మిషన్ కోసం ఆమోద ముద్ర పొందేందుకు రాజ్ భవన్ కార్యాలయానికి పంపించింది సర్కార్.
అయితే ప్రభుత్వం సమర్పించిన ఆర్టీసీ బిల్లు విలీనానికి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు గవర్నర్(Tamilisai Soundararajan). తనకు 5 అంశాలకు సంబంధించి క్లారిటీ కావాలని కోరారు తమిళి సై సౌందర రాజన్. దీంతో బిల్లుకు ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు బంద్ కు పిలుపునిచ్చారు.
ఛలో రాజ్ భవన్ పేరుతో వేలాది మంది ముట్టడించే ప్రయత్నం చేశారు. చివరకు ఆర్టీసీ యూనియన్ నేతలను చర్చించేందుకు ఆహ్వానించారు గవర్నర్. ఆర్టీసీ సంస్థ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చివరకు బిల్లుకు ఆమోద ముద్ర వేశారు తమిళి సై సౌందర రాజన్.
Also Read : Gampa Govardhan KCR : కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ