RTC Driver Busi Babu : ఆర్టీసీ బిల్లు కోసం ఆగిన ‘గుండె’
ధర్నా చేస్తూ డ్రైవర్ మృతి
RTC Driver Busi Babu : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ ఆమోదించడం ఆలస్యం కావడంతో తట్టుకోలేక ఆందోళన బాట పెట్టిన ఆర్టీసీ డ్రైవర్ గుండె పోటుతో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆదివారం కొమురం భీం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన డ్రైవర్ బూసి బాబు గుండె పోటుతో మృతి చెందారు.
RTC Driver Busi Babu No More
ఆయన వయసు 52 ఏళ్లు. ఆర్టీసీ బిల్లు తాత్సారం చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ ఉదయం ఆర్టీసీ గేటు వద్ద పాల్గొన్నారు బూసి బాబు. ఆయన ఆందోళనలో పాల్గొన్న సమయంలో ఛాతిలో నొప్పి వచ్చింది. హుటా హుటిన తోటి కార్మికులు కాగజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో విషాదం నెలకొంది కొమురం భీం జిల్లాలో.
తోటి కార్మికులు కన్నీటి పర్యంతం అయ్యారు. నిన్నటి దాకా తమతో పాటు ఉన్న బూసి బాబు ఇప్పుడు లేరంటే నమ్మలేక పోతున్నామని వాపోయారు. బూసి బాబు మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా ప్రభుత్వం నిలవాలని కోరారు.
ఇదిలా ఉండగా కేసీఆర్(KCR) సంచలన ప్రకటన చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి బిల్లును ఆమోదం కోసం రాజ్ భవన్ కు పంపించారు. ఎట్టకేలకు ఇవాళ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆమోదం తెలిపింది. కానీ అంత లోనే ఆర్టీసీ డ్రైవర్ బూసి బాబు తనువు చాలించడం విషాదం నింపింది.
Also Read : RTC Bill Approved : ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు ఆమోదం