Bajireddy Govardhan : లాభాల బాట ప‌ట్టిన ఆర్టీసీ

రూ. 14 కోట్ల లాభం వ‌స్తోంది

Bajireddy Govardhan : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ మెల మెల్ల‌గా గాడిన ప‌డుతోంది. ఈ విష‌యాన్ని సంస్థ చైర్మ‌న్(Bajireddy Govardhan) బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ వెల్ల‌డించారు. గ‌తంలో రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోలు తీవ్ర న‌ష్టాల‌లో కూరుకు పోయి ఉండేవ‌న్నారు. కానీ ప్ర‌స్తుతం సీన్ మారింద‌న్నారు. 50 డిపోలు లాభాల బాట ప‌ట్టాయ‌న్నారు.

వినూత్నంగా సంస్క‌ర‌ణ‌లు తీసుకు రావ‌డం వ‌ల్ల ఇది సాధ్య‌మైంద‌ని చెప్పారు. రోజుకు రూ. 14 నుంచి రూ. 15 కోట్ల ఆదాయం స‌మ‌కూరుతోంద‌ని వెల్ల‌డించారు. ఆర్టీసీలో వినూత్నంగా ప్ర‌వేశ పెట్టిన కార్గో ద్వారా భారీ ఆదాయం స‌మ‌కూరుతోంద‌న్నారు. దీని వ‌ల్ల ఆర్టీసీలో మ‌రికొంద‌రికి ఉపాధి క‌ల్పించేలా చేస్తోంద‌న్నారు. ఇక పండుగ‌, జాత‌ర స‌మ‌యాల్లో అద‌న‌పు బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని చెప్పారు.

అంతే కాకుండా ఆర్టీసీలో త్వ‌ర‌లో డిజిట‌లైజేష‌న్ ద్వారా చెల్లింపులు చెల్లించేలా తీసుకు రానున్న‌ట్లు వెల్ల‌డించారు. అంతే కాకుండా కేవ‌లం ఫెస్టివ‌ల్స్ స‌మ‌యాల్లో తెలంగాణ ఆర్టీసీకి రూ. 21 కోట్ల ఆదాయం స‌మ‌కూరుతోంద‌ని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు రేయింబ‌వళ్లు క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్నార‌ని, ప్ర‌స్తుతం గాడిన ప‌డింద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ సింగ‌ర్ రామ్ మిరియాలా ప‌డిన తెలంగాన్ ఆన్ ట్రాక్ సాంగ్ ను ఆవిష్క‌రించారు చైర్మ‌న్ బాజి రెడ్డి, ఎండీ సజ్జ‌నార్. అంతే కాకుండా బ‌స్సులు బాగా లేక పోయినా జ‌నం ఎక్కుతున్నార‌ని , సంస్థ‌ను త‌మ‌దిగా భావిస్తున్నార‌ని కొనియాడారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌యాణిస్తున్న వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు ఎండీ.

ఆర్టీసీలో ఏముందంటూ హేళ‌న‌గా మాట్లాడార‌ని కానీ ఇక్క‌డ ప్ర‌యాణీకుల సంతోషం దాగి ఉంద‌న్నారు చైర్మ‌న్.

Also Read : అమ్మో క‌వితా మామూలు లేదుగా – చుగ్

Leave A Reply

Your Email Id will not be published!