Indigo CEO : రూల్స్ అతిక్ర‌మించ లేదు – ఇండిగో సిఇఓ

డీజీసీఏ ప్ర‌కార‌మే ప్ర‌యాణికుల‌కు సేవ‌లు

Indigo CEO : రాంచీలో చిన్నారి ప‌ట్ల ఇండిగో సిబ్బంది నిర్వ‌హించిన తీరు ప‌ట్ల దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఇదే స‌మ‌యంలో కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా సీరియ‌స్ అయ్యారు.

విచార‌ణ‌కు ఆదేశించామ‌న్నారు. నివేదిక అనంత‌రం చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. స్వ‌యంగా త‌నే ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు ఇండిగో సిఇఓ(Indigo CEO). త‌మ సిబ్బంది భ‌ద్ర‌తా నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కే ప్ర‌వ‌ర్తించార‌ని తెలిపారు.

ప్ర‌త్యేక అవ‌స‌రాలు ఉన్న చిన్నారిని రాంచీ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం ఎక్కేందుకు అనుమ‌తించ లేద‌న్న దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు సిఇఓ. విమానంలో ఎటువంటి అంత‌రాయం క‌ల‌గ కూడ‌ద‌ని నిబంధ‌న‌లు చెబుతున్నాయ‌ని వెల్ల‌డించారు.

రాంచీలోని త‌మ విమానంలో ప్ర‌త‌యేక అవ‌స‌రాలు ఉన్న పిల్లల‌ను అనుమ‌తించ కూడ‌ద‌న్న ఎయిర్ లైన్ నిర్ణ‌యంపై సిఇఓ రోజోయ్ ద‌త్తా పేర్కొన్నారు. గ‌త కొన్నేళ్లుగా ఒకే చిన్నారి త‌మ‌తో 50 సార్లు ప్ర‌యాణం చేసిన‌ట్లు వెల్ల‌డంచారు.

విమాన భ‌ద్ర‌త విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డకూడ‌ద‌ని రూల్స్ తెలియ చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. తాము సిబ్బందికి , ఉన్న‌త స్థాయి ఉద్యోగుల‌కు ప్ర‌ధానంగా దిశా నిర్దేశం చేస్తామ‌ని ప్ర‌త్యేకించి ర‌క్ష‌ణ విష‌యంపైనే ఫోక‌స్ పెడ‌తామ‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు డీజీసీఏ ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన టీమ్ ను ఏర్పాటు చేసింద‌ని వెల్ల‌డించారు.

విమాన భ‌ద్ర‌త అనేది డీజీసీఏ , ఎయిర్ లైన్ ల మ‌ధ్య భాగ‌స్వామ్యం ఉంద‌ని ఇందులో భాగంగా త‌మ బాధ్య‌త‌లు ఏమిటనేవి స్ప‌ష్టంగా చెప్పింద‌న్నారు సిఇఓ. ప్ర‌యాణీకుల‌పై ర‌క్షించే బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్నారు.

Also Read : ఆ ఘ‌ట‌న బాధాక‌రం – సీఇఓ

Leave A Reply

Your Email Id will not be published!