Russia Ban : జ‌పాన్ పీఎం..మంత్రుల‌పై ర‌ష్యా నిషేధం

ప‌లువురు దేశాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌కు ఝ‌ల‌క్

Russia Ban : ర‌ష్యా కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది జ‌పాన్ ప్ర‌ధాన మంత్రి పుమియో కిషిడాకు. ఉక్రెయిన్ పై ర‌ష్యా సైనిక చ‌ర్య‌ను (Russia Ban)నిర‌సిస్తూ ఆ దేశం శిక్ష‌కు అర్హులేనంటూ పేర్కొన్న వెంట‌నే ఈ చ‌ర్య‌కు దిగింది.

జ‌పాన్ పీఎంతో పాటు అమెరికా దేశ ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్ , ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకెర్ బ‌ర్గ్ పై త‌మ దేశానికి రాకుండా నిషేధం విధిస్తున్న‌ట్లు ర‌ష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధ‌వారం వెల్ల‌డించింది.

ర‌ష్యా ఫెడ‌రేష‌న్(Russia Ban) కు వ్య‌తిరేకంగా అప‌వాదులకు గురి చేయ‌డం, ప్ర‌త్య‌క్ష బెదిరింపుల‌కు దిగ‌డాన్ని త‌మ దేశం ఎట్టి ప‌రిస్థితుల్లో ఆమోదించ‌దని పేర్కొంది. ఈ మేర‌కు నిషేధిత వ్య‌క్తుల జాబితాను ప్ర‌క‌టించింది.

ఇందులో విడుద‌ల చేసిన నిషేధిత లిస్టులో జ‌పాన్ విదేశాంగ శాఖ మంత్రి యోషిమాసా హ‌యాషి, ర‌క్ష‌ణ శాఖ మంత్రి నోబువో కిషి కూడా ఉన్నారు.

ఆంక్ష‌లు ల‌క్ష్యంగా ఉన్న వ్య‌క్తులు నిర‌వ‌ధికంగా ర‌ష్యాలోకి ప్ర‌వేశించ‌కుండా నిషేధానికి గురి కాబ‌డ‌తారంటూ వెల్ల‌డించింది ర‌ష్యా.

ఉక్రెయిన్ లో క్రెమ్లిన్ సైనిక కార్య‌క‌లాపాల‌కు అమెరికా విధించిన ఆంక్ష‌ల‌కు ప్ర‌తిస్పంద‌న‌గా ర‌ష్యా గ‌త నెల‌లో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ పై ప్ర‌యాణ నిషేధాన్ని విధించింది.

ర‌ష్యన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్ర‌కారం పెంటగాన్ సీనియ‌ర్ వ్య‌క్తులు, అమెరిక‌న్ వ్యాపార నాయ‌కులు, జ‌ర్న‌లిస్టుల‌తో స‌హా 27 మంది ఇత‌ర యుఎస్ అధికార‌ల‌పై నిషేధం విధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

మాస్కో జారీ చేసిన స్టాప్ లిస్ట్ లో భార‌త సంత‌తికి చెందిన మంత్రులు కూడా ఉండ‌డం విశేషం.

Also Read : యుఎస్ సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!