Zelensky : డ్రోన్ల‌తో వ‌రుస దాడులకు ర‌ష్యా ప్లాన్

ఉక్రెయిన్ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ

Zelensky : ర‌ష్యా దేశ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై నిప్పులు చెరిగారు ఉక్రెయిన్ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ(Zelensky). గ‌త ఏడాదిలో ప్రారంభ‌మైన యుద్దం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. కొత్త సంవ‌త్స‌రంలో కూడా కంటిన్యూ అవుతోంది. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌రిగింది. యావ‌త్ ప్ర‌పంచం నెత్తీ నోరు బాదుకున్నా పుతిన్ వినిపించు కోలేదు.

ఇక జెలెన్ స్కీ మంకు ప‌ట్టు వీడ‌డం లేదు. ఇద్ద‌రూ యుద్దానికి సిద్దం అంటున్నారు. కొత్త సంవ‌త్స‌రంలో ఎవ‌రికి వారు త‌మ‌దే విజ‌యం అంటూ ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో వార్ ఇప్ప‌ట్లో ముగిసేలా క‌నిపించ‌డం లేదు. త‌న‌కు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు కావాల‌ని కోరుతున్నారు జెలెన్ స్కీ.

ఇద్ద‌రూ చ‌ర్చ‌ల‌కు రావాల‌ని, శాంతి తోనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని ముందు నుంచీ పేర్కొంటోంది భార‌త్. ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ర‌ష్యా చీఫ్ పుతిన్ కు ఫోన్ చేశారు. ఈ సంద‌ర్భంగా ముందు అమెరికా, యూరోపియ‌న్ దేశాలు జెలెన్ స్కీకి ఆయుధాలు, ఆర్థిక సాయం నిలిపి వేయాల‌ని చెప్పాల‌ని స్ప‌ష్టం చేశాడు పుతిన్.

ఇదిలా ఉండ‌గా తాజాగా ఉక్రెయిన్ చీఫ జెలెన్ స్కీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.త‌మ దేశంపై సుదీర్ఘంగా డ్రోన్ల‌తో దాడికి పాల్ప‌డేందుకు ప్లాన్ చేసిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించాడు జెలెన్ స్కీ(Zelensky).

కాగా డోన్ బాస్ ప్రాంతంలో ర‌ష్యా సైనికుల‌పై దాడి చేసిన త‌ర్వాత జెలెన్ స్కీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

Also Read : ఇక‌నైనా యుద్దాన్ని ఆపండి – జై శంక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!