S Jai Shankar : సల్మాన్ రష్డీపై దాడి బాధాకరం – జై శంకర్
ప్రపంచం గమనించిందన్న కేంద్ర మంత్రి
S Jai Shankar : ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సల్మాన్ రష్డీపై న్యూయార్క్ లో దాడి జరగడాన్ని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. మితి మీరిన మతోన్మాదం వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రష్డీ శాటనిక్ వర్సెస్ పేరుతో పుస్తకాన్ని రాశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దివంగత మత గురువు ఇరాన్ కు చెందిన ఆయతుల్లా ఖొమైనీ. రష్డీపై ఫత్వా జారీ చేశారు. అతడి తలకు వెల కట్టారు.
ఈ ఫత్వాను 1989లో జారీ చేశారు. ఆనాటి నుంచి చాలా సాధారణ జీవితం గడుపుతూ వచ్చారు సల్మాన్ రష్డీ. ఆయనకు 75 ఏళ్లు. కళా స్వేచ్ఛపై జరిగిన సమావేశానికి హాజరైన సందర్భంగా న్యూజెర్సీకి చెందిన ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో కాలేయం, కన్ను పూర్తిగా పాడై పోయింది. ఆయన వెంటిలేటర్ మీద ప్రాణం పోలేక కొట్టు మిట్టాడుతున్నాడు. ఈ ఘటనను తీవ్రంగా
ఖండించారు బ్రిటన్ పీఎం రేసులో ఉన్న రిషి సునక్. తాజాగా భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్(S Jai Shankar) స్పందించారు.
ఈ దాడి బాధాకరం. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలి. మనిషి స్వేచ్ఛను పూర్తిగా హరించే ఏదైనా దానిని గర్హంచాల్సిందేనంటూ పేర్కొన్నారు. యావత్
ప్రపంచం రష్డీ పై జరిగిన దాడిని గమనిస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని అన్నారు ఎస్ జైశంకర్.
ఏదైనా అభ్యంతరం ఉన్నట్లయితే స్పందించాలే తప్పా ఇలా భౌతికంగా దాడికి దిగడం మంచి పద్దతి కాదన్నారు జై శంకర్.
Also Read : సల్మాన్ రష్డీపై దాడి ఓ హెచ్చరిక – సునక్