S Jai Shankar Satya Nadella : సత్య నాదెళ్ల జై శంకర్ ములాఖత్
మైక్రోసాఫ్ట్ సిఇఓతో కీలక చర్చలు
S Jai Shankar Satya Nadella : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ మైక్రో సాఫ్ట్ సిఇఓ, చైర్మన్ సత్య నాదెళ్లను(S Jai Shankar Satya Nadella) కలుసుకున్నారు. ఇద్దరూ చాలా సేపు చర్చించారు. ఇందులో ప్రధానంగా డిజిటల్ డొమైన్ లో డెలివరీ, పాలన, భద్రతపై ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఇద్దరూ కలుసుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి తన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇప్పటికే భారత్ కు సంబంధించి కీలకమైన టెక్నాలజీ అంశంపై ఇతోధికంగా సహకారం అందజేస్తున్నారు సత్య నాదెళ్ల. ఆయన స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా. ఆయన తండ్రి దివంగత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ యుగంధర్.
ఇక సత్య నాదెళ్ల భార్య ఫౌండేషన్ పేరుతో విశిష్ట సేవలు అందజేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన అవసరాలను గుర్తించి వారిని కార్యోన్ముఖులుగా తీర్చి దిద్దడంలో సహాయ పడుతున్నారు. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎక్కువగా డిజిటలైజేషన్ మంత్రాన్ని జపిస్తున్నారు.
ఇందులో భాగంగా డిజిటలైజేషన్ ప్రక్రియకు ఇతోధికంగా సాయం చేయాలని ఇప్పటికే టెక్ దిగ్గజాలను కోరారు. ఈ మేరకు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ , మైక్రో సాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్లతో సుదీర్ఘంగా చర్చించారు. భారత్ డిజటల్ కు వీరు సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు.
ఈ మేరకు సాయం చేస్తున్నారు కూడా. ఇదిలా ఉండగా గత ఏడాది సత్య నాదెళ్లతో పాటు సుందర్ పిచయ్ కు పద్మశ్రీ పురస్కారం కూడా అందజేశారు.
Also Read : ‘టాయిలెట్ పేపర్స్’ మీదే బాధ్యత