S Jai Shankar : ఎస్ జై శంక‌ర్ నామినేష‌న్ దాఖ‌లు

కేంద్ర మంత్రిగా ఉన్న జై శంక‌ర్

S Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖా మంత్రిగా ఉన్న సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ సోమ‌వారం రాజ్య‌స‌భ స‌భ్యుడి కోసం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎస్ జైశంక‌ర్(S Jai Shankar). గుజ‌రాత్ నుంచి రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. అంత‌కు మించిన గౌర‌వంగా కూడా ఉంద‌ని పేర్కొన్నారు. మాతృ భూమికి సేవ చేసే భాగ్యం క‌ల్పించినందుకు సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు డాక్ట‌ర్ సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్.

గ‌తంలో దివంగ‌త ప్ర‌ధాని అట‌ల్ బిహార్ వాజ్ పేయి వ‌ద్ద కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. చైనాలో రాయ‌బారిగా కూడా ప‌ని చేశారు సుదీర్ఘ కాలం పాటు. అనంత‌రం ఆయ‌న ప‌నితీరును నిశితంగా గ‌మ‌నించిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అద్బుత‌మైన అవ‌కాశం ఇచ్చారు.

ఏకంగా కేబినెట్ లోకి తీసుకున్నారు కేంద్ర విదేశాంగ శాఖా మంత్రిగా. ఆయ‌న కొలువు తీరాక భార‌త దేశానికి ఎన‌లేని పేరు తీసుకు వ‌చ్చేలా పాటు ప‌డ్డారు. ఒక ర‌కంగా మోదీని ప్ర‌పంచ వ్యాప్తంగా నాయ‌కుడిగా రూపొందించేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్.

క్లిష్ట‌మైన స‌మ‌యంలో కూడా త‌న ప‌నితీరుతో ఆక‌ట్టుకున్నారు. దాయాది దేశం పాకిస్తాన్ కు చెందిన మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఏకంగా ఎస్ జైశంక‌ర్ ప‌నితీరును ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. ఇది ఆయ‌న నిబ‌ద్ద‌త‌కు ద‌క్కిన గౌర‌వం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : Arvind Kejriwal : ఢిల్లీలో రెడ్ అల‌ర్ట్ – కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!