S Jai Shankar Blinken : ఆంటోనీ బ్లింకెన్ తో జై శంకర్ భేటీ
ప్రధాని మోదీ యూఎస్ టూర్ పై చర్చ
S Jai Shankar Blinken : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken) తో సమావేశం అయ్యారు. ఆదివారం హిరోషిమాలో జరుగుతున్న జి7 శిఖరాగ్ర సదస్సు సందర్బంగా ఇద్దరు మంత్రులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ టూర్ సందర్బంగా చర్చించారు.
ప్రధాని మోదీకి ప్రత్యేకంగా అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ , ప్రథమ మహిళ జిల్ బైడెన్ విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే బైడెన్ మోదీని ఆహ్వానించారు. ఆయన రాక కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని బైడెన్ స్వయంగా పీఎంకు చెప్పడం విశేషం.
ఈ సందర్బంగా తాము మోదీ పర్యటన కోసం ఎంతగానో ఆసక్తితో ఎదురు చూస్తున్నట్లు తెలిపారు ఆంటోనీ బ్లింకెన్. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ జూన్ 22న యుఎస్ లో అధికారిక పర్యటనకు బయలు దేరి వెళతారు. తన పర్యటన సందర్బంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ వైట్ హౌస్ లో జరిగే విందులో పాల్గొంటారు.
బైడెన్ , జిల్ బైడెన్ ఆహ్వానం పలుకుతారు. భారతదేశం , యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను ఈ టూర్ నొక్కి చెబుతుందని అమెరికా పేర్కొంది. రెండు దేశాలు ఇప్పటికే పరస్పరం అవగాహన కలిగి ఉన్నాయి.
Also Read : CM Siddaramaiah