Sachin Pilot : వచ్చే ఏడాది రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉన్నారు. ఆ పోస్ట్ పై మొదటి నుంచీ కన్నేశారు మరో సీనియర్ నాయకుడు సచిన్ పైలట్(Sachin Pilot). హై కమాండ్ అతడిని బుజ్జగిస్తూ వచ్చింది.
తాజాగా ప్రశాంత్ కిషోర్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరు ఉంటారు ఎవరికి పదవులు దక్కుతాయో తెలియని పరిస్థితి నెలకొంది ఆ పార్టీలో.
ఈ తరుణంలో గురువారం ఉన్నట్టుండి సచిన్ పైలట్ ఢిల్లీలో ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆమెను మర్యాద పూర్వకంగా కలిశారు.
రాజస్థాన్ లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తు ఏంటి. తనకు ఇచ్చే పోస్ట్ ఏంటో, తాను ఏం చేయాలనే దానిపై క్లారిటీ ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
సచిన్ పైల్ ఇప్పటి వరకు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా పని చేశారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా పార్టీ అప్పగించింది.
ఈ రెండింటి పదవులను సచిన్ పైలట్ 2020లో తిరుగుబాటు చేసిన కారణంగా కోల్పోయాడు. రాహుల్ గాంధీ సన్నిహుతల జాబితాలో ఆయన కూడా ఉన్నారు.
చివరి వ్యక్తి ఆయనే కావడం విశేషం. జ్యోతిరాదిత్యా సింధియా, జితిన్ ప్రసాద, ఆర్పీ ఎన్ సింగ్ వంటి అద్భుతమైన నాయకులు భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యారు.
ఇక మిగిలింది సచిన్ పైలట్ ఒక్కడే. సచిన్ పైలట్ సీఎం కావాలని కోరాడు. పార్టీ అనుభవం కలిగిన గెహ్లాట్ వైపు మొగ్గింది. భేటీ అనంతరం పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా చేసేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశాడు.
Also Read : ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్ట్