Sachin Pilot : ముదిరిన వివాదం సీఎంకు అల్టిమేటం
అశోక్ గెహ్లాట్ పై భగ్గుమన్న సచిన్ పైలట్
Sachin Pilot : ఓ వైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా పోయిన పరువు దక్కించు కోవాలని ప్రయత్నం చేస్తోంది 138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తెలంగాణ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్ పీసీసీ చీఫ్ లతో సమావేశం ఏర్పాటు చేసింది. త్వరలో ఈ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా ఏఐసీసీకి తలనొప్పిగా మారింది రాజస్థాన్ రాష్ట్ర వ్యవహారం. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనసాగుతోంది. విచిత్రం ఏమిటంటే స్వంత పార్టీకి చెందిన సీఎం అశోక్ గెహ్లాట్ పై మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్(Sachin Pilot) కారాలు మిరియాలు నూరుతున్నారు.
మాటల తూటాలు పేల్చుతున్నారు. ఆయనకు మాజీ సీఎం వసుంధర రాజేకు దగ్గరి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఆపై రాష్ట్రంలో అవినీతి పెరిగి పోతోందని, కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం పట్టించు కోవడం లేదంటూ మండిపడ్డారు. దీనిపై సచిన్ పైలట్ ను హెచ్చరించింది ఏఐసీసీ. అయినా తన తీరు మార్చు కోలేదు పైలట్. ఇదిలా ఉండగా తాజాగా మరో కీలక కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి సీఎం అశోక్ గెహ్లాట్ పై నిప్పులు చెరిగారు.
అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సీఎంకు అల్టిమేటం ఇవ్వడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. కన్నడ నాట 136 సీట్లు వచ్చినా అక్కడ ఇరువురు నేతల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరుకు చెక్ పెట్టింది ఏఐసీసీ. మరి రాజస్థాన్ విషయంలో ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : LSG vs MI IPL 2023 Eliminator