Sachin Pilot : అవినీతిపై యుద్ధం దీక్షకు సిద్దం
మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్
Sachin Pilot : రాజస్థాన్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం అశోక్ గెహ్లాట్ హామీలను నెరవేర్చే పనిలో పడ్డారు. కానీ ఆయన స్వంత పార్టీలోనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. సీఎం సీటుపై కన్నేసి ఉంచిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మరోసారి కంట్లో నలుసుగా మారారు.
రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నా పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా సచిన్ పైలట్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా తాను మంగళవారం నిరాహారదీక్ష చేపడతానంటూ వెల్లడించారు.
వసుంధర రాజే నేతృత్వం లోని గత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, వాటిపై విచారణ చేపట్టి ప్రస్తుతం కొలువుతీరిన సీఎం గెహ్లాట్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సచిన్ పైలట్(Sachin Pilot). 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సర్కార్ తన ప్రకటనలు, వాగ్ధానాలకు కట్టుబడి ఉందని ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు మాజీ డిప్యూటీ సీఎం.
ఎక్సైజ్ , మాఫియా, అక్రమ మైనింగ్ , భూ ఆక్రమణలు , లిలిత్ మోదీ అఫిడవిట్ కేసులపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సంచలన ఆరోపణలు చేశారు.
వసుంధర రాజే దుష్పరిపాలనపై ఆరోపించిన పాత వీడియోలను ఈ సందర్బంగా ప్రదర్శించారు సచిన్ పైలట్. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.
Also Read : వాళ్లు మమ్మల్ని కాపీ కొడుతున్నారు – రౌత్