Avula Subbarao Arrest : సాయి డిఫెన్స్ డైరెక్టర్ అరెస్ట్
పక్కా ప్లాన్ ప్రకారమే అల్లరు జరిగాయి
Avula Subbarao Arrest : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్ పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైళ్లకు నిప్పంటించారు. పలు బోగీలు బుగ్గిపాలయ్యాయి.
కేంద్రం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ స్కీం ను రద్దు చేయాలని, కొత్తగా రిక్రూట్ మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ కు చెందిన రాకేశ్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మొత్తం ఘటన వెనుక పూర్తిగా ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ కి చెందిన డైరెక్టర్ ఆవుల సుబ్బారావు(Avula Subbarao Arrest) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ మేరకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరికి ఫోన్లు చేశారు. ఎవరెవరిని రెచ్చగొట్టారనే దానిపై విచారణ ప్రారంభించారు. గుంటూరు పోలీసులు ఆవుల సుబ్బారావును(Avula Subbarao Arrest) ఖమ్మం జిల్లాలో గుర్తించి అరెస్ట్ చేశారు.
అక్కడి నుంచి అతడిని నరసరావుపేటకు తరలించారు. ఇదిలా ఉండగా పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు బయట పడ్డాయి. ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల సహకారంతోనే విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించారు.
అకాడెమీలలోనే విధ్వంసకారులకు నివాసం ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో చోటు చేసుకున్న ఈ అల్లర్లకు ఆంధ్రాలో మూలాలు ఉండడం గమనార్హం.
ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వే స్టేషన్ కి వచ్చినట్లు తేలిందని సమాచారం. వాటిర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులి హోర ప్యాకెట్లు అందజేసినట్లు అనుమానిస్తున్నారు.
Also Read : సికింద్రాబాద్ ఘటనలో అరెస్ట్