Sajjala Ramakrishna Reddy : స్కిల్ స్కామ్ విలన్ చంద్రబాబు
సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్
Sajjala Ramakrishna Reddy : విజయవాడ – ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ స్కిల్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి, పాత్రధారి అసలైన విలన్ నారా చంద్రబాబు నాయుడని ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Sajjala Ramakrishna Reddy Comments Viral
చేసిన నేరానికి తప్పు ఒప్పుకోవాల్సిన మాజీ సీఎం, తన అరెస్ట్ ను సాకుగా చూపి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఏదో ఒక రోజు పాపం పండక తప్పదన్నారు. పక్కా ఆధారాలను ఏపీ సీఐడీ కోర్టుకు సమర్పించిందని చెప్పారు.
ఆయన అరెస్ట్ వెనుక రాజకీయ దురుద్దేశం, కక్ష సాధింపు చర్యలు ఏవీ లేవన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). ఎంత మంది లాయర్లను, న్యాయవాదులను తీసుకు వచ్చిన తప్పు చేసిన బాబును రక్షించ లేరని తేలి పోయిందన్నారు.
ఆయన పనిలో పనిగా చంద్రబాబు నాయుడు దత్త పుత్రుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. నేరం చేసిన వ్యక్తికి పవన్ ఎలా సపోర్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు ప్రభుత్వ సలహాదారు.
మరో వైపు చంద్రబాబు నాయుడు జీవితాంతం చిప్ప కూడు తింటాడని మంత్రి ఆర్కే రోజా సెల్వమణి సంచలన కామెంట్స్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు.
Also Read : Chandrababu Naidu Arrest : స్కిల్ స్కామ్ లో జడ్జి కీలక తీర్పు
