Sajjala Ramakrishna Reddy: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా !

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా !

Sajjala Ramakrishna Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో పలువురు ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. జగన్‌ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)తో సహా 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా సీఎస్‌ జవహర్‌రెడ్డికి లేఖలు పంపారు. జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలు సమర్పించారు. ఫలితాలు వెలువడిన వెంటనే తితిదే ఛైర్మన్‌ పదవికి భూమన కరుణాకర్‌రెడ్డి రాజీనామా చేశారు. తనను రిలీవ్ చేయాలని సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు పదవీ కాలాన్ని పొడిగించాలని ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు పంపించడం గమనార్హం.

Sajjala Ramakrishna Reddy…

కడప ఆర్కిటెక్చర్ వర్సిటీ రిజిస్ట్రార్‌ పదవి నుంచి రిలీవ్ చేయాలని జగన్ బంధువు ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తనను తిరిగి మాతృసంస్థకు పంపాలని వీసీని కోరారు. గతంలో ఈయన కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలో బయో టెక్నాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. డిప్యూటేషన్‌పై ఆర్కిటెక్చర్‌ వర్సిటీలో చోటు సంపాదించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ పోస్టులోకి వెళ్లారని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. అయితే డిప్యూటేషన్‌పై ఉన్న వారిని తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.

Also Read : Chandrababu Naidu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ?

Leave A Reply

Your Email Id will not be published!