Sajjala Ramakrishna Reddy : రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్నారు వైఎస్సార్ సీపీ చీఫ్, ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన ప్రక్షాళన చేయడం స్టార్ట్ చేశారు.
ఇందులో భాగంగా ఇప్పుడున్న కేబినెట్ కు మంగళం పాడే పనిలో పడ్డారు. ఇక నుంచి పార్టీ బాధ్యతలు తీసుకుని మళ్లీ ఘన విజయాన్ని సాధించేలా కృషి చేయాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు కొత్త జాబితా కూర్పు పనిలో పడ్డారు. ఒరిస్సా, ఢిల్లీ టూర్ లో ఉన్న గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ రావడంతో హుటా హుటిన సీఎం జగన్ కలిశారు.
ఈనెల 11న ముహూర్తం ఖరారు చేశానని, ఇక కొత్త మంత్రులతో కేబినెట్ ను పునర్ వ్యవస్థీకరించనున్నట్లు గవర్నర్ కు తెలియ చేశారు. దీంతో ఎవరు ఉంటారు ఎవరికి చోటు లభిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
నిన్నటి దాకా పవర్ ఫుల్ గా ఉన్న వాళ్లు పవర్ పోయిందని బాధ పడాల్సిన పని లేదని ఇప్పటికే స్పష్టం చేశారు సీఎం జగన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లాయా లేదా అన్న దానిపై ఫోకస్ పెట్టాలని ఆదేశించారు.
ఇప్పటికే కేబినెట్ కు తాను ఏం చేయబోతున్నాడో చెప్పారు. తాజాగా ప్రభుత్వం ఏం చేయబోతోందో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). ఈ మేరకు మే నెల నుంచి గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read : 11న ముహూర్తం ఖరారు