Sajjala Ramakrishna Reddy : త‌ల్లికి బాగో లేక పోతే విమ‌ర్శ‌లా

అవినాష్ కు అండ‌గా స‌జ్జ‌ల

Sajjala Ramakrishna Reddy : ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాజీ మంత్రి, దివంగ‌త వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఇప్ప‌టికే ఆయ‌న తండ్రిని అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఎంపీని అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగం సిద్దం చేసింది. కానీ అవినాష్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ముంద‌స్తు బెయిల్ కావాల‌ని దానికి కోర్టు ఒప్పుకోలేదు. ఇదే స‌మ‌యంలో త‌న త‌ల్లి అనారోగ్యంతో ఉంద‌ని ఆమెను చూసుకునేందుకు తాను ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.

దీనిని విప‌క్షాలు త‌ప్పు ప‌ట్టాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. స్వంత త‌ల్లి అనారోగ్యంతో ఉంటే కూడా విమ‌ర్శ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు . ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. డ్రామాలంటూ పేర్కొన‌డం స‌భ్య‌త అనిపించు కోద‌న్నారు స‌జ్జ‌ల‌. ఇలాంటి నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు. కొన్ని మీడియా సంస్థ‌లు త‌ప్పుడు క‌థ‌నాలు, అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఏదైనా తెలుసుకుని ప్ర‌సారం చేయాల‌ని లేనిపోని వార్త‌ల‌తో ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దోవ ప‌ట్టించ‌వ‌ద్ద‌ని కోరారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆరేడుసార్లు సీబీఐ వ‌ద్ద‌కు విచార‌ణ‌కు వెళ్లార‌ని , స‌హ‌క‌రిస్తూ వ‌స్తున్నార‌ని చెప్పారు. చంద్ర‌బాబు హ‌యాంలో సీబీఐకి నో ఎంట్రీ అని పెట్టిన విష‌యం మ‌రిచి పోయారా అని ప్ర‌శ్నించారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.

Also Read : Mamata Banerjee

Leave A Reply

Your Email Id will not be published!