Sajjala Ramakrishna Reddy : భారీగా స్కామ్ లు అందుకే కేసులు
ప్రభుత్వ సలహాదారు సజ్జల
Sajjala Ramakrishna Reddy : అమరావతి – ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ మాజీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని ఏకి పారేశారు. లెక్కకు మించి స్కామ్ లకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. అందుకే ఏపీ సీఐడీ ఆయనపై కేసులు నమోదు చేసిందని చెప్పారు.
Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu
సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల పాటు ఆయన చేసింది ఏమీ లేదన్నారు. ఒక్కటన్నా తాను అమలు చేసిన స్కీం ఏదైనా ఉందంటే చెప్పాలన్నారు . అధికారంలో ఉన్న సమయంలో సంపదను దోచుకున్నాడని, వాటిని తన అనుచరులు, అనుయాయులు, బంధువులకు అప్పగించాడని దానిని కాపాడు కునేందుకే నాటకాలు ఆడుతున్నాడంటూ ఆరోపించారు.
ఇన్నాళ్ల పాటు వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ వచ్చాడని , కానీ జగన్ వచ్చాక సీన్ మారిందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). ఆధారాలు ఉన్నాయి గనుకనే చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేశారని స్పష్టం చేశారు. ఆయనపై తమకు వ్యక్తిగత కక్ష అంటూ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు.
ఏం సాధించాడని, ఏం వెలగబెట్టాడని ఆయనకు వెల్ కమ్ చెబుతున్నారో టీడీపీ శ్రేణులకు తెలియాలంటూ ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక పేరుతో అడ్డంగా దోచుకున్న గజ దొంగ అంటూ మండిపడ్డారు.
Also Read : CM KCR : కాంగ్రెసోళ్లు సోయి లేనోళ్లు