Sajjanar MD TSRTC : మహిళలు, సీనియర్లకు ఖుష్ కబర్
టీఎస్ఆర్టీసీ చౌక ధరకే టికెట్లు
Sajjanar MD TSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రయాణీకుల సౌకర్యార్థం కొత్తగా టి9 టికెట్ తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధి సంస్థ కార్యాలయంలో ఎండీ వీసీ సజ్జనార్ ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సౌకర్యం పల్లె బస్సులలో వర్తిస్తుందని తెలిపారు ఎండీ. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో టి-24, టి – 6, ఎఫ్ -24 పేరుతో టికెట్లను ప్రారంభించింది.
వీటికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని నిత్యం వివిధ పనుల నిమిత్తం ఒకే రూట్ లో ప్రయాణించే వారిని దృష్టిలో పెట్టుకుని టి9 టికెట్ ను ప్రవేశ పెట్టినట్లు చెప్పారు ఎండీ వీసీ సజ్జనార్. ఈ టికెట్ ఈనెల 18న ఆదివారం నుంచే బస్సులలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఆయా బస్సులలో విధులు నిర్వహించే కండక్టర్లు లేదా బస్సు డ్రైవర్లు (ఒన్ మ్యాన్ సర్వీస్ ) కలిగిన వారి వద్ద అందుబాటులో ఉంటాయని చెప్పారు.
అయితే ఈ టికెట్ మాత్రం కేవలం మహిళలు, సీనియర్ సిటిజన్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంతే కాదు ఈ టికెట్ కేవలం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పని చేస్తుందని తెలిపారు. టి9 టికెట్ ధరను రూ. 100 నిర్ణయించినట్లు వెల్లడించారు ఎండీ వీసీ సజ్జనార్(Sajjanar). కాగా సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డు చూపించాలని సూచించారు.
Also Read : MK Stalin Slams : గవర్నర్ రవిపై సీఎం గుస్సా