Sake Sailajanath : మణిపూర్ సర్కార్ ను బర్తరఫ్ చేయాలి
మాజీ మంత్రి సాకే శైలజానాథ్ డిమాండ్
Sake Sailajanath : మణిపూర్ లో చోటు చేసుకున్న అల్లర్లకు తక్షణమే అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, మాజీ ఏపీపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు నెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనల కారణంగా ప్రజలకు నిద్ర లేకుండా పోయిందన్నారు. తాజాగా ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి , అత్యాచారానికి పాల్పడడం దారుణమన్నారు. మనం ఆదిమ కాలంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందన్నారు సాకే శైలజానాథ్.
Sake Sailajanath Words
ఈ ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే శిక్షించాలని , బహిరంగంగా ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. గత కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు శైలజానాథ్(Sake Sailajanath). కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ కావాలని నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు. మోదీ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందంటూ ధ్వజమెత్తారు.
మణిపూర్ లో ఇప్పటి వరకు జరిగిన సంఘటనల్లో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని , 300 మంది గాయపడ్డారని, 10 వేల మంది సైనికులు మోహరించినా హింస కంట్రోల్ లోకి రావడం లేదన్నారు సాకే శైలజానాథ్.
Also Read : Congress Slams : మోదీ మౌనం దేనికి సంకేతం
