Pedda Sesha Vahanam : శ్రీనివాసుడి సాక్షాత్కార వైభవోత్సవం
ఘనంగా ఉత్సవాలు ప్రారంభం
Pedda Sesha Vahanam : శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ఈ నెల 26వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతాయి.
ఉత్సవాలలో భాగంగా ఉదయం సుప్రభాతంతో శ్రీ స్వామి వారిని మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం , సహస్ర నామార్చన నిర్వహించారు. 10 గంటల నుండి 11 గంటల వరకు ఆలయంలో శ్రీదేవి, భూదేవి, సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల సేవ చేపట్టారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్ద శేష వాహనం(Pedda Sesha Vahanam)పై స్వామి, అమ్మ వార్లు ఆలయ మాడ వీధుల్లో విహరించారు. భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ఉత్సవాల సందర్భంగా భారీ ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఇదే సమయంలో టీటీడీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేందుకు విశేషంగా చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. మరో వైపు తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. నిన్న ఒక్క రోజే 82 వేల మందికి పైగా స్వామి వారిని దర్శనం చేసుకోవడం విశేషం.
Also Read : DK Shiva Kumar Comment : ‘టార్చ్ బేరర్’ ఫోకస్ ఫలిస్తుందా